నేడు సీనియర్ నటి జ్యోతిక పుట్టినరోజు… స్పెషల్ ఏంటంటే….!!

సీనియర్ నటి జ్యోతిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు జ్యోతిక సదానా. హీరోయిన్ నగ్మా సొంత చెల్లెలి జ్యోతిక. జ్యోతిక అందంతో పాటు, నటన, నర్తనలోనూ ఆమెకు ఆమె సాటి. తమిళ్ స్టార్ హీరో సూర్యను వివాహం చేసుకున్న తర్వాత కూడా తనదైన శైలిలో పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది.

” డోలీ సజా కే రఖ్నా ” అనే హిందీ సినిమాతో ఆమె తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఈరోజు ఆమె పుట్టిన రోజు జరుపుకుంటున్న జ్యోతిక.. 45వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఇక తెలుగులో మాస్, ఠాగూర్ వంటి పలు సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.

తెలుగు, హిందీ, తమిళ్ భాషలకు సంబంధించిన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె పుట్టినరోజు సందర్భంగా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు సెలబ్రిటీలు, తమ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.