మహేష్ బాబు – రేణు దేశాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన ఆ రొమాంటిక్ సినిమా ఏంటో తెలుసా..?

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేణు దేశాయ్‌ ఒకప్పుడు మంచి హీరోయిన్. పవన్ కళ్యాణ్ తో కలిసి బద్రి సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి కాస్ట్యూమ్ డిజైనర్గా సెటిలైంది. ఇక చాలాకాలం తర్వాత ఆమె మళ్ళీ తాజాగా మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో నటించింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న రేణు దేశాయ్‌ పలు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.

ఇక ప్రస్తుతం రేణు దేశాయ్‌కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ మురారి ‘ సినిమా ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంది. ఇందులో పెళ్లి పాటలు ఇప్పటికీ చాలామంది పెళ్లిలో పెళ్ళి వీడియోస్ లో వినిపిస్తూనే ఉంటాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా సోనాలి బింద్రే నటించింది. కానీ మొదట ఈ సినిమాకు హీరోయిన్గా రేణుదేశాయ్‌ని సంప్రదించారట డైరెక్టర్ కృష్ణవంశీ.

అయితే ఆమెకు మనసులో చేయాలని ఉన్న సినిమాలు చేయకూడదని అప్పటికే నిర్ణయం తీసుకోవడంతో సినిమాను రిజెక్ట్ చేసింద‌ట‌. ఆ తర్వాత సోనాలి బింద్రేని తీసుకున్నారు. ఇక మహేష్ – సోనాలి బింద్రే కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ సాధించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ సినిమా రేణు దేశాయ్ నటించి ఉంటే మరో లెవెల్‌లో ఆమె క్రేజ్ ఉండేది అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.