ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్.. శృతిహాసన్ ఎమోషనల్..!

కమల్ హాసన్ డాటర్ శృతిహాసన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న శృతి.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కోట్లాదిమంది ప్రేక్షకుల ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. త్వరలో ఇంగ్లీష్ మూవీ దిఐ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమా పలు విభాగాల్లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో నామినేట్ అయిందని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా శృతిహాసన్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకుంది.

ఈ మూవీ తనకు ఎంతో స్పెషల్ అంటు చెప్పిన శృతి.. గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ స్క్రీనింగ్‌లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ విభాగంలో నామినేట్ అయ్యింది. అలాగే బెస్ట్ ఫిల్మ్‌ క్యాటగిరీలో లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్‌ ఫెస్టివల్ కు కూడా ఈ సినిమా నామినేట్ అయింది. కోర్పుదీవుల్లో పర్యావరణహితంగా ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమా ప్రేక్షకులకు చూపించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపింది శృతిహాసన్‌.

విడుదల తేదీని మూవీ టీం ఇంకా ప్రకటించలేదు. ది లాస్ట్ కింగ్డమ్ ఫేమ్‌ మార్క్ రౌలీ ఈ సినిమాలో హీరోగా, డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో ఈ సినిమా తర్కెక్కింది. ఓ దీవిలో మరణించిన తన భర్త అస్థికల కోసం తిరిగి అక్కడికి వెళ్లిన వితంతువు పై సాగే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. మరోవైపు ప్రభాస్ స‌లార్‌ సినిమాలో శృతిహాసన్ నటించింది. డిసెంబర్ 22వ సినిమా ప్రేక్షకు ముందుకు రాబోతుంది. ఆమె కీలకపాత్ర పోషించిన హాయ్‌ నాన్న కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. నాని హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటించింది.