నిత్య మీనన్ పెళ్లికి దూరంగా ఉండడానికి కారణం.. ఆ నటి ఆత్మహత్య చేసుకోవడమేనా..?!

సౌత్ ఇండియాలో మల్టీ టాలెంటెడ్ స్టార్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది మళ‌యాల కుట్టి నిత్యమీన‌న్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన సత్తాను చాటుకున్న నిత్య తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆడపా ద‌డ‌పా సినిమాల్లో నటిస్తున్న ఈమె పెళ్లి గురించి ఏదైనా వార్త వినిపిస్తే మాట దాటేస్తుంటుంది. అయితే గత ఏడాదిగా ఈమె పెళ్లి కుదిరింది అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మళ‌యాల‌ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోని నిత్యమీనన్ వివాహం చేసుకోబోతుందంటూ. ప్రముఖ వెబ్‌సైట్లు.. సోషల్ మీడియాలు వార్తలను ముద్రించాయి. దీనిపై స్పందించిన నిత్య అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే టాలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న నిత్యామీనన్.. పెళ్లి గురించి తమిళ నటుడు సినీ విశ్లేషకుడు ఆయన బైల్వాన్ రంగనాథన్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

కొన్ని సంవత్సరాల క్రితం మలయాళ బ్యూటీ పెళ్లి చేసుకుని వరకట్నం, గృహహింస కారణంతో ఆత్మహత్య చేసుకుందని.. ఈ భయం నిత్యమీనన్ బ్రెయిన్ పై ఒత్తిడి తెచ్చిందని. ఆమె ఇంట్లో వారందరూ పెళ్లి చేసుకోమని అడుగుతున్నా సరే ఈ బలమైన కారణం వల్లే ఆమె వివాహానికి నో చెబుతుందని కామెంట్స్ చేశాడు. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. దీనిపై నిత్యామీనన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.