భగవంత్ కేసరి హీరోయిన్స్ పారితోషకం ఎంతంటే.. ఆమెకే ఎక్కువా..?

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి నిన్న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. ముఖ్యంగా బాలయ్య కూడా అభిమానులను తన సినిమాతో మరొకసారి ఖుషీ చేశారు. ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్, కూతురుగా శ్రీ లీలా నటించి మెప్పించారు. ఇకపోతే ఈ సినిమాలో నటీనటుల పారితోషకం చాలా వైరల్ గా మారింది. ముఖ్యంగా కాజల్ కంటే శ్రీలీలకే ఈ సినిమా ద్వారా ఎక్కువ పారితోషకం లభించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా ద్వారా మొదటిసారి బాలయ్య సరసన హీరోయిన్గా కాజల్ నటించింది. హీరోయిన్ గా వివాహం తర్వాత కెరియర్ ఆగిపోవడంతో సీనియర్ తారల సరసన ఈమె నటిస్తోంది. ఇక స్టార్ హీరోయిన్ ఇమేజ్ కి అడుగు దూరంలో ఉన్న శ్రీ లీల ఇందులో కూతురు పాత్రలో నటించి పెద్ద సాహసమే చేసిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోని వీరిద్దరి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది..? ఎవరు ఎక్కువ తీసుకున్నారు? అనే అనుమానం చాలా మందిలో మొదలయ్యింది. అయితే ఇద్దరిలో కాజల్ కంటే కూడా శ్రీ లీలా ఎక్కువగా పారితోషకం వసూలు చేసిందట.

 

కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కాత్యాయని అనే మిడిల్ ఏజ్డ్ పాత్రలో నటించింది. పెళ్లి, పిల్లల తర్వాత ఆమె హీరోయిన్గా నటించిన సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఇందులో కాజల్ కి రూ.1.05 కోట్ల పారితోషకం ఇవ్వగా శ్రీ లీల మాత్రం ఏకంగా రూ .1.8 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ సమయంలోనే ఓకే చేసింది కాబట్టి ఇప్పుడు డిమాండ్ కి ఇంకా తక్కువగానే శ్రీ లీలా పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తోంది.