దృశ్యం వంటి సూప‌ర్ హిట్ మూవీని రిజెక్ట్ చేసిన రజ‌నీకాంత్‌.. రీజ‌న్ తెలిస్తే షాకైపోతారు!

జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో మోహన్‌లాల్, మీనా జంట‌గా న‌టించిన‌ ‘దృశ్యం’ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఆ తర్వాత దృశ్యం సినిమాను తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాష‌ల్లో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్, కన్నడలో రవిచంద్రన్, త‌మిళంలో లోకనాయకుడు కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా న‌టించారు.

రీమేక్ అయిన అన్ని భాష‌ల్లోనూ దృశ్యం సక్సెస్ సాధించింది. ఆ త‌ర్వాత మూవీకి కొన‌సాగింపుగా వ‌చ్చిన‌ దృశ్యం 2 కూడా విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఇక‌పోతే త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ `పాపనాశనం` టైటిల్ తో దృశ్యంను రీమేక్ చేశారు. గౌత‌మ్ ఆయ‌న‌కు భార్య న‌టిస్తే.. నివేదా థామస్, ఎస్తేర్ అనిల్ కూతుళ్లుగా యాక్ట్ చేశారు. అయితే నిజానికి ఈ సినిమా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చేయాల్సింద‌ట‌.

దృశ్యం త‌మిళ రీమేక్ కు ఫ‌స్ట్ ఛాయిస్ రజ‌నీకాంతే. కానీ, క‌థ న‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న రిజెక్ట్ చేశారు. అందుకు రీజ‌న్ తెలిస్తే షాకైపోతారు. ఈ సినిమాలో హీరోను జైల్లో వేసి ఒక కానిస్టేబుల్ చిత‌క్కొట్టేస్తాడు. అయితే ఆ సీన్ లో తాను న‌టిస్తే ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు అనే చిన్న కార‌ణంతో ర‌జ‌నీకాంత్ దృశ్యం ను రిజెక్ట్ చేశారు. దాంతో క‌మ‌ల్ హాస‌న్ క‌థ‌లోకి వ‌చ్చారు. ఏదేమైనా హీరోలు అన్నాక ప్ర‌యోగాలు చేయాలి. ఫ్యాన్స్ ఒప్పుకోరు, జీర్ణించుకోలేరు అని కూర్చుంటే.. ఇలానే ఎన్నో మంచి సినిమాలు మిస్ అవ్వాల్సి ఉంటుంది.