`భగవంత్ కేసరి`లో శ్రీలీల చిన్నప్పటి పాత్ర పోషించిన చైల్ట్ ఆర్టిస్ట్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి కాంబోలో వ‌చ్చిన ఫ‌స్ట్ మూవీ `భ‌గ‌వంత్ కేస‌రి`. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీలీల కీల‌క పాత్రను పోషించింది. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 19న భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రి.. పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ అంతా చుడ‌ద‌గిన చిత్రంగా విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది.

ఈ సినిమాలో బాల‌య్య త‌ర్వాత బాగా హైలెట్ అయిన పాత్ర శ్రీ‌లీలదే. ఈ బ్యూటీ గురించి అంద‌రికీ తెలుసు. అయితే సినిమాలో శ్రీ‌లీల చిన్న‌ప్ప‌టి పాత్ర పోషించిన చైల్ట్ ఆర్టిస్ట్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? సీరియ‌ల్స్ చూసేవారికైతే ఆమె ఎవ‌రో ఖ‌చ్చితంగా తెలుస్తుంది. ఆ చిన్నారి పేరు నైనిక, ముద్దు పేరు మిన్ను. బుల్లితెర‌పై మోస్ట్ పాపుల‌ర్ సీరియ‌ల్ `ఎన్నెన్నో జన్మల బంధం` లో ఖుషి పాత్ర‌ను పోషిస్తుంది మ‌రెవ‌నో కాదు ఈ నైనిక‌నే.

నైనిక సంగారెడ్డిలో అక్టోబర్ 2 వ తేదీన రవికాంత్, ప్రియ అనే దంపతులకు జన్మించింది. చిన్న‌త‌నం నుంచి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెంచుకున్న నైనిక‌.. టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోస్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే ఎన్నెన్నో జన్మల బంధం సీరియ‌ల్ లో ఛాన్స్ ద‌క్కించుకుంది. తొలి సీరియ‌ల్ అయిన‌ప్ప‌టికీ ముద్దు ముద్దు మాట‌లు, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో బుల్లితెర‌ ప్రేక్ష‌కుల‌కు బాగా దగ్గ‌రైంది. టాలెంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. ప‌లు యాడ్స్ లో కూడా న‌టించింది. ఇప్పుడు భ‌గ‌వంత్ కేస‌రితో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. త‌న‌దైన న‌ట‌న‌తో అందరినీ ఆక‌ట్టుకుంది.