ట్విస్ట్ కనిపెట్టేన తేజ.. బిగ్ బాస్ పరువు పోయిందిగా (వీడియో)..!!

బిగ్ బాస్ 7 ఐదు వారాలు పూర్తిచేసుకుని ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక గత నామినేషన్స్ లో శుభశ్రీ ఎలిమినేట్ కాగా.. భోలే , అర్జున్, అశ్విని, పావని, పూజ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆదివారం ఎపిసోడ్‌లో గౌతమ్‌ను కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్‌కి పంపించారు. కానీ హౌస్ మేట్స్ కు మాత్రం గౌతమ్ సీక్రెట్ రూమ్ లో ఉన్న విషయం తెలియదు. ఇక బిగ్ బాస్ చేసే కొన్ని కొన్ని మిస్టేక్స్ కారణంగా ట్విస్టులు కనిపెట్టేస్తున్నారు హౌస్ మేట్స్.

ఈ క్రమంలోనే ఉల్టా పుల్టా కింద జరిగిన గౌతమ్ ఎలిమినేషన్ కూడా ఫేక్ అని వాళ్లకు అర్థం అయిపోయింది. ఎందుకంటే సాధారణంగా ఏ కంటిస్టెంట్ అయినా హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే వారికి సంబంధించిన సామాన్లను పంపించేస్తారు. కానీ గౌతమ్ రెండు, మూడు సూట్ కేసులు మాత్రమే పంపించి మిగిలినవి అక్కడే ఉంచారు. దీంతో డౌట్ వచ్చిన తేజ.. గౌతమ్ ఎలిమినేట్ కాలేదు. ఎందుకంటే వాడు నిజంగా ఎలిమినేట్ అయితే వాడి బెడ్ ఖాళీ అయ్యేది. అలా కాలేదు.

అంతేకాకుండా.. ఎలిమినేషన్ అనేది జనాల చేతిలో ఉంది. కానీ గౌతమ్‌ను హౌస్ మేట్స్‌ ఎలిమినేట్ చేశారు. కాబట్టి వాడు కచ్చితంగా సీక్రెట్ రూమ్ లో ఉండి ఉంటాడు. రెండు, మూడు రోజుల్లో తిరిగి హౌస్ లోకి వచ్చేస్తాడు అంటూ తేజ చెప్పాడు. దీంతో ప్రియాంక, శోభ శెట్టి కూడా తేజ చెప్పింది నిజమే అని అంటారు. ఇక తేజ బుర్రకు పని చెప్పడంతో బిగ్ బాస్ ట్విస్ట్ రివిల్ అవ్వడంతో పరువు పోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రేక్షకులు.