హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ శ్రీజ పోస్ట్… ఎవరికోసమో తెలుసా…!!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె మొదట ఓ అబ్బాయిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఓ కూతురు పుట్టాక అతడికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత కల్యాణ్ దేవ్ కి ఇచ్చి చిరంజీవి పెళ్లి చేశాడు. అయితే వీరిద్దరికీ కూడా ఓ కూతురు పుట్టింది.

వీరిద్దరికీ ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. పిల్లలతో శ్రీజ చిరంజీవి ఇంట్లో ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంది. తాజాగా తన ఫ్రెండ్ రచనకు బర్తడే విషెస్ తెలిపింది. ” హ్యాపీ బర్త్ డే మై లవ్ రచన పాలకుర్తి ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాకుండా ఆమెకు ముద్దు పెడుతూ ఉన్న ఫోటో కూడా షేర్ చేసింది.

ప్రస్తుతం శ్రీజ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్తను వదిలేసి ఇటువంటి పోస్ట్లు పెడుతూ ఎంజాయ్ చేస్తుందంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు. అయినప్పటికీ ఏ ఒక్క కామెంట్ ని లెక్కచేయకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది.