బిగ్ బాస్ నుంచి శివాజీ అవుట్…. ఇదేం ఉల్టా పుల్టా రా బాబు…!!

బిగ్ బాస్ సీజన్ 7లో ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. బాగా ఆడే వాళ్ళని ఇంటి నుంచి బయటకు పంపించేస్తున్నారు. ఆడని వాళ్ళని ఇంట్లోనే ఉంచుతున్నారు. మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చారు. మొన్నటికి మొన్న ఎలిమినేట్ అయిన‌ వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చారు. టైటిల్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరని అడిగితే ఎక్కువమంది శివాజీ అనే చెబుతారు.

మైండ్ గేమ్ తో ఆటను తన వైపు టర్న్ చేసుకుంటున్నాడు శివాజీ. అయితే సడన్గా బిగ్ బాస్ పెద్ద ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచ్చాడు. అసలు దీన్ని ట్విస్ట్ అనేకంటే పెద్ద షాక్ అని చెప్పడం బెటర్. ఎందుకంటే హౌస్ నుంచి శివాజీని బయటికి పంపించేశాడు. నిన్నటి ఎపిసోడ్ ముగిశాక ప్రోమో ఎపిసోడ్లో శివాజీ సడెన్ గా కన్ఫెషన్ రూమ్ లో కనిపించాడు.

శివాజీ మిమ్మల్ని బయటకి తీసుకు వెళ్లడం జరుగుతుంది.. అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ వెంటనే శివాజీ బయటకి వచ్చి అక్కడే ఉన్న హౌస్ మేట్స్ అందరితో నేను బయటికి వెళ్తున్న అంటూ చెప్పాడు. ఈ షాక్‌ తో కంటెస్టెంట్లు అందరూ శివాజీని వెళ్ళద్దు అని బ్రతిమాలారు. కానీ సడన్ గా గెట్స్ ఏపెన్‌ అవడంతో వెళ్లిపోయాడు శివాజీ. దీంతో హౌస్ మేట్స్ అందరూ షాక్ కి గురయ్యారు.