పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే కోపంతో రెచ్చిపోయిన రేణు దేశాయ్… ఎక్కడో తెలుసా…!!

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరికీ ఆద్య, అకిరా నందన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఏవో కారణాలవల్ల వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ మాత్రం పిల్లల బాధ్యత తీసుకుని వారిని జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఉంటుంది.

అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గట్టి కౌంటర్స్ వేస్తుంది. తాజాగా ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు రేణు దేశాయ్ ఫుల్ ఫైర్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్ లో ఒకతను ఇంటర్వ్యూస్ లో పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నలు అడగొద్దని చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. దానికి రేణు దేశాయ్ స్పందిస్తూ…” నేను ఆయనతో 11 ఏళ్లు కలిసి ఉన్నాను. ఆయన నా ఇద్దరు పిల్లలకు తండ్రి.

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలో లేదో అనేది పూర్తిగా నా ఇష్టం. జనాలు అలాంటి పాలసీ తీసేయండి. సోషల్ మీడియాలో ఏం చేయాలనేది మీకు మేము చెబుతున్నామా. మీరు ఎవరు నాకు చెప్పడానికి ” అని గట్టిగా రిప్లై ఇచ్చింది. అంతే కాదు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.