ఈ మూవీతో కొత్త‌గా.. వింటేజ్ బ్రహ్మానందం..!!

మన టాలీవుడ్ కింగ్ ఆఫ్ కామెడీ అంటే గుర్తొచ్చే మొదటి పేరు హాస్య బ్రహ్మానందం. అయితే తను ఇప్పటికే ఎన్నో వేల సినిమాల్లో కనిపించి తెలుగు ఆడియన్స్ ని మెప్పించాడు. అయితే ఇప్పుడు ఆయన చాలా తక్కువ సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా తనలాంటి ఓ నటుణ్ని పెట్టుకుని కూడా దర్శకులు ఒక ఫుల్ లెన్త్ కామెడీ రోల్స్ లో చాలా తొక్కువే చూపించారు.

దీంతో చాలా వరకు గెస్ట్ ఆపీరిన్స్ లోనే కనిపించిన బ్రహ్మానందం ఒక్క సినిమాలో మాత్రం తన వింటేజ్ టైమింగ్ తో ఫుల్ లెంత్‌లో అలరించనున్నారని తెలుస్తుంది. ఆ సినిమానే తాను నటించిన లేటెస్ట్ చిత్రం ” కీడా కోలా “. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా నటించనున్నాడు.

బ్రహ్మీ అయితే ఈ సినిమాలో వింటేజ్ ట్రీట్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. అది కూడా ఫుల్ లెంగ్త్ లో తాను కనిపించనున్నారు. దీంతో చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఒక సాలిడ్ ట్రీట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.