చిరంజీవి ప్రమోట్ చేసిన బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా.. బ్లాక్ బాస్టర్ హిట్‌?

నందమూరి నట‌సింహం బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చినా.. వ్యక్తిగతంగా వారిద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే గతంలో ఎవరి ఇంట్లో ఈవెంట్లు జరిగిన మరో హీరో కూడా ఖచ్చితంగా అందులో హాజరయ్యేవారు. అప్పుడప్పుడు స్టేజ్ పైన కూడా ఇరువురు కలిసి సందడి చేసేవారు. ఇటీవల కాలంలో బిజీ స్కెడ్యూల్ తో ఇద్దరు ఒకరి మధ్య ఒకరి స్నేహాన్ని ప్రేక్షకులు వీక్షించలేక‌పోతున్నారు. ఇక గతంలో చిరంజీవి.. బాలయ్య సినిమా ప్రమోషన్ వీడియోను స్వయంగా తానే సిద్ధం చేసుకున్నాడట.

ప్రస్తుతం ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా.. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369. ఈ సినిమా టాలీవుడ్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను దూరదర్శన్‌లో ప్రమోట్ చేయడం కోసం చిరంజీవి, విజయశాంతిని అప్రోచ్ అయ్యారట మూవీ టీం. ఇక ఈ సినిమా స్టోరీ తో బాగా ఇంప్రెస్ అయిన చిరంజీవి సినిమా ప్రమోషన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ‌ట. అంతేకాదు స్వయంగా చిరంజీవిని సినిమా ప్రమోషన్ కోసం ఓ వీడియోను సిద్ధం చేశాడట.

పిల్లలతో సహా ఖచ్చితంగా చూడవలసిన సినిమా ప్రతి ఒక్కరు థియేటర్లకు వెళ్లి వీక్షించండి అంటూ ఆదిత్య 369 సినిమాను ప్రమోట్ చేశాడు. ఇక వీరిద్దరి మధ్యన స్నేహంతోనే ఈ సినిమా ప్రమోషన్స్ అంత హైలెట్ అయ్యాయని చెప్పవచ్చు. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో ప్ర‌స్తుతం వైరల్ అవ్వడంతో.. వీరిద్దరి సినిమాలు ఒక సినిమా ఒకరు ప్రమోట్ చేసుకోవడం కాదు కానీ.. వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ మూవీ వస్తే చాలా బాగుంటుందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో అయినా వీరిద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ వస్తుందేమో వేచి చూడాలి.