విజయ్ లియోలో రామ్ చరణ్, కమల్ హాసన్ కూడా.. ట్విస్ట్ అదిరిపోయింది..

లోకేష్ కనగ‌రాజన్‌ దర్శకత్వం వహించింది చాలా తక్కువ సినిమాలైనా తెరకెక్కించిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ కావడంతో భారీ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సెన్సేషనల్ హిట్‌లు తన ఖాతాలో వేసుకున్న లోకేష్ కనగ‌రాజన్‌.. తాజాగా తమిళ్ హీరో విజయ్‌తో లియో సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యావరేజ్ సినిమాని సైతం వేరే లెవెల్‌కి తీసుకెళ్లి బ్లాక్ బాస్టర్ హిట్ చేసే సత్తా లోకేష్ కనగ‌రాజన్‌కు మాత్రమే ఉంది.

ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుక్కింగ్లు దక్షిణాది సినీ ఇండస్ట్రీ హిస్ట‌రీలోనే ఆల్ టైం రికార్డ్ గ్రాస్ ని నెలకొల్పే దిశగా అడుగులు వేస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటివరకు ఈ సినిమాపై జరిగిన ప్రమోషనల్ కంటెంట్ ఏది ప్రేక్షకుల్లో హైప్‌ తీసుకురాలేకపోయింది. కనీసం ఆకట్టుకోలేకపోయింది. బ్లడీ స్వీట్ అనే వీడియో తప్ప ఒకటి కూడా ఆశించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఇక అనిరుద్ స్వరపరిచిన రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ అందుకోలేదు.

ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ ఏవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సంజయ్ దత్ విక్రమ్‌ కలిసి ఉన్న పోస్ట్ అయితే భారీగా ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విక్రమ్ సినిమాకి లియోకు కనెక్షన్ ఉందట. విక్రమ్ సినిమాకి కూడా ఖైదీ సినిమాతో లింక్ ఉన్నట్లు చూపిస్తారు. ఇలా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ లియో సినిమా కూడా తెర‌కెక్కుతుందంటున్నారు.

విక్రమ్ మూవీ తో లింక్ ఉన్న‌ ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర కాసేపు కనిపిస్తుందని టాక్. అలాగే విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ పాత్ర ద్వారా సూర్య ఎంట్రీ ఎవ‌రు మర్చిపోలేరు. లియో సినిమాలో కూడా అలా క్లైమాక్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్ర ఎంట్రీ ఉండబోతుందని.. ఈ పాత్ర త్వరలో రాంచరణ్ – లోకేష్ కాంబినేషన్లో వచ్చే మూవీకి లీడ్ కాబోతుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇందులో ఏమాత్రం నిజం ఉందో తెలియదు గానీ అయితే లీయోలో మరో ఇద్దరు సూపర్ స్టార్ నటించబోతున్నారనమాట.. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో.. అని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.