కన్నడ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. చేసింది తక్కువ సినిమాలేవైనా ఈ అమ్మడు చేతిలో దాదాపుగా డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. శ్రీ లీల తన అందంతోను డాన్స్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగులో ఇంతటి పాపులారిటీ పెంచేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇతర సినిమాల ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఎక్కువగా ఈమెను ఆహ్వానిస్తూ ఉన్నారు. పెళ్లి సందD సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రవితేజ తో కలిసి ధమాకా సినిమాతో స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది.
బ్యాక్ టు బ్యాక్ ఈ ఏడాది ఈమె సినిమాలు వరుసగా విడుదల కాబోతూనే ఉన్నాయి. అయితే తాజాగా తన ఫేవరెట్ హీరో ఎవరో తెలిపి అందరికీ షాక్ ఇచ్చింది. మ్యాడ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల సిద్దు జొన్నలగడ్డ, దుల్కర్ సల్మాన్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈవెంట్ లో మాట్లాడుతూ తన అభిమాన హీరో దుల్కర్ సల్మాన్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఈవెంట్లో మాట్లాడుతూ తమ అభిమాన హీరో కార్యక్రమానికి వస్తున్నారని చెప్పినప్పుడు తన తల్లి కూడా చాలా సంతోషించింది అని మిమ్మల్ని అడిగానని చెప్పమంది అంటు తెలిపింది శ్రీ లీల.
తనకు చిన్నప్పటినుంచి ఒక కల వచ్చేది మా అమ్మమ్మ చెప్పిన కథలు విన్నప్పుడు గుర్రం మీద వస్తున్న యువరాజుని సైతం ఊహించుకున్నానని..మీ హిరియే పాటను చూసినప్పుడు నాకు మీరే నా రాకుమారుడుగా అనిపించారంటు శ్రీ లీలా తెలియజేసింది. దీంతో దుల్కర్ చిన్నగా నవ్వి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో దాదాపుగా పది చిత్రాలు ఉన్నాయి. అభిమాని హీరో తులసి దుల్కర్ అభిమానులు చాలా ఆనందపడుతున్నారు.