ఇసుకలో కూరుకుపోయిన మిల్కీ బ్యూటీ.. మెక‌ప్ లేకుండా క్యాజువ‌ల్ క్లిక్స్..

ఇండస్ట్రీ లోకి చాలామంది యంగ్‌ హీరోయిన్లు అడుగుపెట్టినా దశాబ్ద కాలంలోపే వారు ఫేడ్అవుట్‌ అయిపోతూ ఉంటారు.కానీ దశాబ్దాలు గ‌డుస్తున్న అదే క్రేజ్‌తో కొనసాగే స్టార్ హీరోయిన్స్ లిస్టును చేతివేళ్లపై లెక్క పెట్టవచ్చు. ఆ లిస్ట్ లోకే వస్తుంది మిల్కీ బ్యూటీ తమన్న. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దం దాటుతున్న తన అంద, చందాలతో గ్లామర్ డాన్సులతో కుర్రాళ్లను ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు క్రేజ్‌ మరింతగా పెంచుకుంటుంది. తమన్న తాజాగా బోల్డ్ వెబ్‌సిరీస్‌లతో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకుంది.

ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ లోనే తన సహనటుడు విజయవర్మతో లవ్ ట్రాక్ నడుపుతుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గానే అనౌన్స్ చేసింది. ఇక కుర్రాళ్లలో తమన్న కి ఉన్నంత క్రేజ్ మరో హీరోయిన్ కి దక్కలేదు అనడంలో అతిశయోక్తి లేదు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌సన నటించిన మిల్కీ బ్యూటీ ఓ పక్కన సినిమాల్లో రాణిస్తూనే సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ గా తమన్నకు గుర్తింపు వచ్చింది.

డిజైనర్ డ్రస్సుల్లో ఫోటోషూట్ చేస్తూ కోట్ల మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండే ఈ బ్యూటి తాజాగా మరోసారి తన అందాలతో కళ్ళు చెదిరే పోజులు ఇచ్చింది. క్యాజువల్ అవుట్ ఫిట్ లో అందాల ఆరబోతకు తెరలేపింది. జిమ్లో అనేక ప్రాంతాల్లో మేకప్ లేకుండా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఇక వాటితో పాటు తమన్న సముద్రపు ఒడ్డున ఇసుకలో మునిగిపోయి ఇస్తున్న ఫోజులు చాలా అడ్వెంచర్స్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇసుకలో కూరుకుపోయినట్టు కూడా ఫొటోస్ దిగుతున్నారా.. అలా ఒంటిపై ఇసుక వేసుకొని ఫొటోస్ దిగుతుంటే నీకు చిరాకు రావడం లేదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.