ఫెయిల్యూర్ తెలియని దర్శకుడు తో రామ్ చరణ్.. కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్..?!

ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించబోతున్నాడు చెర్రీ. ఇక ఇప్పటికే ఈ సినిమాతో పాటు పలు సినిమాలో చెర్రికి అవ‌కాశాలు వ‌స్తున్నాయంటూ న్యూస్ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లోనూ రామ్‌చరణ్‌కి అవకాశాలు వస్తున్నాయట.

పలువురు బాలీవుడ్ దర్శక , నిర్మాతలు చరణ్ కోసం కథలో తయారు చేసుకునే పనిలోఉన్నారు. అందులో కొందరు క్రేజీ డైరెక్టర్ కూడా ఉన్నారు. వారిలో ఫెయిల్యూర్ తెలియని దర్శకుడు రాజకుమార్ హిరానీ కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ముంబైలో రామ్ చరణ్.. రాజకుమార్ హీరోని కలిసాడట. రాజ్ కుమార్ ఓ కథ కూడా చరణ్‌కి వినిపించడం ఆ డైరెక్టర్ కథను విన్న రామ్ చరణ్ దానికి గ్రీన్ సిగ్న ఇవ్వడం జరిగిందంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రాజ్ కుమార్ హీరోని ప్రస్తుతం షారుక్ ఖాన్ తో డుంకి సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమా ఉండబోతుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్ ఫాన్స్ కు ఇది నిజంగా గుడ్డ్ న్యూస్ అని చెప్పాలి.