ముమైత్ ఖాన్ తో పూరి జగన్నాథ్ ఎఫైర్.. ఇన్నాళ‌కు బయటపడ్డ సీక్రెట్‌..!!

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్న పూరి జగన్నాథ్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు. ఎంతో మందిని స్టార్ హీరోలుగా మార్చాడు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే పూరీకి ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామందితో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అందులో హీరోయిన్ ఛార్మితో పూరి రిలేషన్ గురించి మాత్రం రోజుకొకటి వినిపిస్తుంటుంది.

గతంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముమైత్ ఖాన్ కి పూరీకి మధ్య కూడా ఏదో నడుస్తుందని టాక్. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ముమైత్ ఖాన్ ముంబై నటి అయిన టాలీవుడ్ కి పరిచయం చేశాడు పూరి. తన తమ్ముడు మూవీ ” 143 ” అనే సినిమాలో ఐటెం సాంగ్ లో ఆమెను తీసుకున్నాడు.

ఆ తరువాత తన డైరెక్షన్లో వచ్చిన అన్ని సినిమాల్లోనూ ఆఫర్ ఇచ్చాడు. దీంతో టాలీవుడ్లో బిజీ అయిపోయింది ముమైత్ ఖాన్. ఈ అవకాశాలు రావడానికి కారణం పూరీనే అని.. వీరిద్దరి మధ్య సమ్ థింగ్ ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇది పాత విషయమే అయినప్పటికీ ప్రజెంట్ ఈ న్యూస్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.