” లియో ” సినిమాలో పవర్ స్టార్… ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!!

తమిళ్ హీరో విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ” లియో ” ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ముందు నుంచి ” విక్రమ్ ” సినిమాలో రోలెక్స్ పాత్ర క్లైమాక్స్ లో ఎలా అయితే వస్తుందో..” లియో ” సినిమా క్లైమాక్స్ లో కూడా ప్రముఖ స్టార్ హీరో ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది.

ఇక హీరో ఎవరు? ఏమిటి అనేది సర్ ప్రైజ్ అంటూ మూవీ టీం ఊరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ స్టార్ హీరో మెగాస్టార్ రామ్ చరణ్ అని టాక్ వినిపించినప్పటికీ.. తాజాగా మరో స్టార్ పేరు వినిపిస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ఉంటాడని మరో బాంబు పేల్చింది. ఆ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ టీమ్‌.

అంటే దాని అర్థం పవన్ కళ్యాణ్ ఈ మూవీలో ఉండడం కాదు.. ఇంటర్వెల్ వచ్చినప్పుడు పవర్ స్టార్ లేటెస్ట్ సినిమా ” ఓజీ ” గ్లింప్స్ వీడియోని ప్లే చేస్తారట. ఇది తెలుసుకున్న పవన్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా గ్లింప్స్ కోసం అయినా లియో సినిమాకి వెళ్తామని కామెంట్లు చేస్తున్నారు.