దెయ్యాలను నమ్మను కానీ మెన్షన్ 24 ట్రైలర్ చూస్తే చాలా భయమేసింది.. యాక్టర్ సత్య రాజ్ కామెంట్స్..

హారర్ మూవీస్‌ సిరీస్‌లుగా రిలీజ్ చేస్తూ హారర్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ ఓంకార్. ఈసారి మెన్షన్ 24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. హాట్ స్టార్ స్పెషల్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. మెన్షన్ 24 లో సత్యరాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానాస్, అయ్యప్ప, పి శర్మ, రావు రమేష్ ఇలా ప‌లువురు కీ రోల్స్ ప్లే చేశారు. మెన్షన్ 24 ఫ్రీ రిలీజ్ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ నేను తెరకెక్కించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. మెన్షన్ 24 ట్రైలర్ కు మంచి ఆదరణ వచ్చింది. ఇక 17 అక్టోబర్ నుంచి ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్టీమ్ అవుతుంది. ఇది నా ఒక్కడి క్రెడిట్ కాదు మా డైరెక్టర్, డివోపి, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్టులు ఇలా టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్టును చేశాం అంటూ వివరించాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ వికాస్, నటి అవికా గోర్‌, యాక్టర్ మానస్, శ్రీమాన్, రాజీవ్ కనకాల, అభినయ, అర్చన జాయిస్, నందు, వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ అందించారు.

ఇక నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ మెన్షన్ 24 వెబ్ సిరీస్ లో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓంకార్ తన పర్ఫెక్షన్ తో ఈ హారర్ సిరీస్ ను ఆకట్టుకునేలా తడికెక్కించాడు. బడ్జెట్ విష‌యంలో అతను చాలా జాగ్రత్తగా పడ్డాడు. నేను సెట్ లో ఏమాత్రం ఖాళీ టైం దొరికిన వాకింగ్ చేస్తా కానీ మెన్షన్ 24 సెట్ లో ఓంకార్ నాకు అలాంటి టైం ఇవ్వలేదు. పర్ఫెక్ట్ గా వర్క్ చేయించేసుకున్నాడు. ఈ సిరీస్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ నా కూతురు. నేను.. శరత్ కుమార్ కలిసి వర్క్ చేసే టైం లో వరలక్ష్మీ సెట్స్ కు వచ్చేది అప్పుడు ఆమె చిన్న పాప.

ఇప్పుడు ఆమెతో కలిసి నటిస్తుంటే ఆ మెమోరీస్ గుర్తుకొచ్చాయి. వీర సింహారెడ్డి వరలక్ష్మి యాక్టింగ్ చూసి చాలా ఆశ్చ‌ర్యంవేసింది. నేను దెయ్యాలు ఉన్నాయంటే నమ్మను కానీ మెన్షన్ 24 ట్రైలర్ చూశాక నాకు చాలా భయమేసింది. హారర్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులను భయపెట్టించాలంటే డైరెక్టర్ మేకింగ్ లో చాలా జిమ్మిక్కులు చేయాలి. అలాంటివి ఓంకార్కు బాగా తెలుసు. మ్యాన్షన్ 24 సీజన్ వన్ ఎండింగ్.. బాహుబలి 1 క్లైమాక్స్ లాంటి ఇంపాక్ట్‌తో ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవ్వాలని నేను భావిస్తున్నా అంటూ సత్యరాజ్ మాట్లాడాడు.