సమంతను డైరెక్ట్ గా అలా సిగ్గు పడకుండా అడిగేసిన నాగార్జున…సామ్ ఫ్యాన్స్ కు ఎక్కడో మండుతుంది గా…!!

నాగచైతన్య, సమంత జంట అందరికీ ఫేవరెట్. వీరు విడాకులు తీసుకుని దాదాపు రెండు సంవత్సరాలు వరకు అవుతుంది. అయినప్పటికీ వీరి విడాకుల గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుది. అనేక కారణాలతో నాగచైతన్య, సమంత నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటున్నారు. అయితే నాగచైతన్యకు సమంత కంటే ముందు వేరే అమ్మాయితో పెళ్లి చేయాలని అనుకున్నాడట నాగార్జున.

ఆ క్రమంలోనే చైతు సామ్ గురించి ఇంట్లో చెప్పి ఒప్పించాడట. ఈ క్రమంలోనే నాగ్ సామ్ ను కొన్ని ప్రశ్నలు అడిగాడట. అవేంటంటే..” నిజంగా చైతు అంటే నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? మీ కల్చర్ వేరు మా కల్చర్ వేరు. ఇద్దరూ ఒకే ఫీల్డ్ లో ఉన్నారు. పెళ్లి అయ్యాక కూడా నువ్వు సినిమాలు చేస్తా అంటున్నావు. ఆ టైంలో మీ మధ్య ప్రాబ్లం రావచ్చు. వాటిని మీరు సరిదిద్దుకోగలరా? కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఒకరికి ఒకరు సర్ది చెప్పుకోగలరా “.. అంటూ ప్రశ్నించాడట.

ఈ వార్త తెలిసిన సమంత అభిమానులు…” మీరు సమంత ని అడిగిన ప్రశ్నలని మేము తప్పు పట్టము.. కానీ అవే ప్రశ్నలు మీ కొడుకుని అడిగారా.. అంటే కోడలు అంటే ఒకటి కొడుకు అయితే ఒకటా. మీ సుపుత్రుడే మా సామ్ నీ మోసం చేశాడు. అప్పుడు ఆ ప్రశ్నలు మీ అబ్బాయిని అడుగుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు ” అంటూ నాగార్జున పై ఫైర్ అయ్యారు.