వరుణ్ పెళ్లి కోసం నితిన్ ఏం చేశాడో చూశారా… ఫ్రెండ్షిప్ అంటే ఇదేగా…!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే వధూవరులు, ఇరు కుటుంబ సభ్యులు.. ఇటలీకి తరలి వెళ్లారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ సైతం తన భార్యతో కలిసి ఇటలీ చేరుకున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. వీరి పెళ్లికి హీరో నితిన్ ఏకంగా బస్సు రెడీ చేసుకుని వెళ్లడం మరో ఎత్తుగా అనిపిస్తుంది. వీరి పెళ్లి ఇటలీలో కావడంతో వీరి కుటుంబ సభ్యులు తప్ప.. ఇతరు నటీనటులు వెళ్లడం లేదు.

ఆ లోటు నితిన్ తీర్చేస్తున్నాడు. ఎలా అని ఆలోచిస్తున్నారా… నితిన్ తాజాగా నటిస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ షూటింగ్ ఇటలీలోనే జరుగుతుంది. నితిన్ తో పాటు ఆయన భార్య, బావ, అక్క సైతం అక్కడే ఉన్నారు. వీళ్ళతో పాటు కొంతమంది మూవీ టీం కూడా ఉంది. దీంతో నితిన్, అతను టీమ్ స్పెషల్ గా బస్సు రెడీ చేసుకుని.. దానిపై వరుణ్, లావణ్యాల పెళ్లి స్టిక్కర్లు వేసి మరీ బయలుదేరాడు.

ఈ బస్సును చూసిన ప్రేక్షకులు…” ఫ్రెండ్షిప్ అంటే ఇది కదా… ఎన్నున్నా ప్రియమైన స్నేహితుడు లేకపోతే మన జీవితం వేస్ట్. కానీ వరుణ్ కు ఆ లోటు లేదు. నితిన్ లాంటి మంచి ఫ్రెండ్ దొరకడం వరుణ్ అదృష్టం. వీరిద్దరూ ఎప్పటికీ సన్నిహితంగా ఉంటూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలి ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.