బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్… మెగా 156 ప్రాజెక్టులో ఐదుగురు హీరోయిన్లు వీళ్లే.. అందరూ కత్తిలాంటి ఫిగర్ లే…!!

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సాధారణ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు చిరు. ఇక ప్రస్తుతం చిరు.. లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లిలో బిజీగా ఉన్నాడు. చిరు తాజాగా వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాల తో మొదలయ్యింది. ఈ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి తరచూ ఈ సినిమాపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.

ప్రస్తుతం మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం జరుగుతున్నాయి. మరోవైపు నటీనటులను కూడా చిత్ర బృందం పరిశీలిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరిలో అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..హనీ రోజ్‌, రెజీనా కసాండ్ర , శ్రీ లీల ఉన్నట్లు తెలుస్తుంది.

అలాగే ఈ మూవీ షోషియో ఫాంటసీ సినిమాగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ దేవ, మానవ, పాతాళలోకాల్లో ఓ పాప చుట్టూ తిరిగే ఫాంటసీ కథ అని సమాచారం. దీనిపై స్పందించిన చిరు ఫ్యాన్స్…” తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఏ సినిమాలో అయినా ఒకరు, ఇద్దరూ హీరోయిన్లు మాత్రమే ఉంటారు. అదే మా చిరు సినిమాలో అంటే… ఏకంగా ఐదుగురు ఉండాల్సిందే. అది మా చిరు ఫాలోయింగ్ అంటే. ఈసారి చిరంజీవి సినిమా రిలీజ్ అయితే థియేటర్లు క్యూ కడతాయి ” అంటూ ఒక రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.