కెప్టెన్ గా హిస్టరీ క్రియేట్ చేసిన గౌతమ్… బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా..!!

బిగ్ బాస్ షో ఉల్టా పుల్టా పేరుతో వచ్చి ఎవరికీ ఊహించని రేంజ్ లో సాగుతుంది. ఈ షో ఇప్పటికే స్టార్ట్ అయ్యి 8 వారాలు అయ్యాయి. తాజాగా కెప్టెన్ అయిన డాక్టర్ బాబు.. బిగ్బాస్ చరిత్రలోనే ఎవ్వరు ఊహించలేని ఆలోచనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. 8 వారాలు పోటీపడి ఎనిమిదో వారంలో కెప్టెన్ అయ్యాడు గౌతం. గౌతమ్ మాట్లాడుతూ..” ప్రతి ఇంట్లో ఆడవాళ్లు ఎన్నో రకాల పనులు చేస్తుంటారు. ఎలాంటి బాధ్యతలు చూసుకోవాలన్న ఆడవాళ్ళది అప్పర్ హ్యాండ్.

ప్రతి ఇంట్లోనూ , బిగ్ బాస్ ఇంట్లోనూ ఉన్న ఆడవాళ్లకు గౌరవంగా కృతజ్ఞతలు చెబుతున్న. ఈవారం మన బిగ్ బాస్ హౌస్ ని ఫిమేల్ వీక్ గా మార్చుకుందాం. అందుకోసం ఈ వారం అంతా లేడీస్ కు హాలిడే ” అంటూ పేర్కొన్నాడు. అలాగే ఎక్కువ పని చేసిన వారిని కష్టజీవి అని.. తక్కువ పని చేసిన వారికి దొంగ అనే బిరుదులు కూడా ఇచ్చాడు.

తక్కువ పని చేసి దొంగ అనే బిరుదును సొంతం చేసుకున్న వారి దగ్గర నుంచి రెండు గుడ్లను తీసుకుని.. కష్టజీవులకు ఇవ్వాలని రూల్ కూడా పెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రేక్షకులు..” గౌతమ్ ఇంత మంచి వాడని అనుకోలేదు. తన ఆలోచనకు ఫిదా అయిపోయాము. గౌతమ్ తప్పకుండా టాప్ ఫైవ్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ గౌతమ్ ” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.