చరణ్ ” గేమ్ చేంజర్ ” మూవీపై సాలిడ్ న్యూస్… మెగా అభిమానులకు మైండ్ దొబ్బేసే అప్డేట్ ఇది..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం చరణ్.. లావణ్య, వరుణ్ పెళ్లి సందడి లో ఉన్నాడు. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ.. తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇకపోతే ఈయన తాజాగా నటిస్తున్న మూవీ ” గేమ్ చేంజర్ “.

ఈ సినిమాని శంకర్ తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాలో వస్తున్న ఈ సినిమా కోసం చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజ్ తన 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. ఈ సినిమా ఇంటర్వెల్ లో రామ్ చరణ్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించనున్నాడట.

అంతేకాకుండా సునీల్ పాత్రలోనూ ఎవ్వరూ అంచనా వేయలేని ట్విస్టులు ఉన్నాయట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది విన్న ప్రేక్షకులు ” మా అన్న సినిమా అంటేనే ఓ రేంజ్ ఉంటుంది. ఆయన అడుగు పెడితేనే ఒక సాలిడ్ లుక్ ఉంటుంది. దానిని మళ్లీ మీరు క్రియేట్ చేయాలా. రాజు ఎక్కడున్నా రాజే. అలాగే మా అన్న ఏ సినిమాలో ఉన్న మా అన్న హీరోనే…” అంటూ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.