శివాజీ తీరుపై మండిపడ్డ నాగార్జున.. పవర్ అస్ట్ర లాగేసుకున్నారుగా….!!

బిగ్ బాస్ షోలో మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా వీకెండ్ ఎపిసోడ్ మాత్రం మంచి రసవక్తంగా ఉంటుంది. అయితే గత మూడు శనివారాలు పెద్దగా ఎంటర్టైన్ చేయకపోయినా.. ఈసారి మాత్రం వాదన, ప్రతి వాదనలతో హీటెక్కిపోయింది ‌. నాగార్జున ప్రతి ఒకరిపై కామెంట్స్ చేశాడు. మరి ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. స్టేజ్ పైకి వచ్చీ రావడంతోనే శుక్రవారం ఏం జరిగిందో చూసిన నాగార్జున.. ఆ తర్వాత ప్రస్తుతానికి వచ్చేసాడు. అసలు లేట్ చేయకుండా సంచాలక్ సందీప్ తో నాగ్ మాట్లాడాడు. ” నువ్వేమైనా గుడ్డివాడివా.. నీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో కనబడిందా” అని స్మైల్ ప్లీజ్ టాస్క్ లో తేజ, గౌతమ్ మెడపై తాడు వేసి లాగడం గురించి అడిగాడు.

ఆ సమయంలో సంచాలక్ అయిన సైలెంట్ గా ఉండటం తప్పని నాగార్జున గట్టిగా ఇచ్చి పడేశాడు. సంచాలక్‌గా పూర్తిగా ఫెయిల్ అయ్యావ్ అంటూ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే టాస్క్ లో ఫోటోలు తీసిన మరో సంచాలక్ అయినా శివాజీపై కూడా నాగార్జున ఫైర్ అయ్యాడు. ” కెమెరా నుంచి నీకు ఏం జరుగుతుందో కనిపించలేదా ” అని అడిగాడు. తాను అరిచానని శివాజీ చెబితే.. నువ్వు గౌతమ్, తేజా ని లాగేటప్పుడు మాత్రమే అరిచావు.. తేజ, గౌతమ్ ని మెడపై తాడు పెట్టి లాగేటప్పుడు అరవలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో శివాజీ పరువు పోయింది. ” హౌస్ లో నువ్వు వీక్ కంటెస్టెంట్స్ తరఫున.. న్యాయం వైపు ఉంటావని నేను అనుకున్నాను. కానీ ఇది చేసినప్పుడు నాకు న్యాయం కనిపించలేదు. అని శివాజీ తీరుపై నాగార్జున ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత సందీప్, శివాజీ, శోభా శెట్టి ఈ ముగ్గురు సంచాలక్ లో ఎవరు సరిగ్గా చేయలేదు అని అడిగాడు నాగార్జున. ఒక్కొక్కరిని పిలిచి వారి పేరు చెప్పమన్నాడు.

కంటెస్టెంట్స్ చెప్పిన హౌస్మెట్ పేరు:

* యావర్-సందీప్

* రతిక-శివాజీ

* అమర్దీప్-శివాజీ

* తేజ-ఎవరూ లేరు

* ప్రశాంత్-సందీప్

* శుభశ్రీ-సందీప్

* ప్రియాంక-ఎవరూ లేరు

* గౌతమ్-శివాజీ

అయితే కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి అడగగా.. సందీప్, శివాజీని చేరో ముగ్గురు నామినేట్ చేశారు. మళ్లీ బయటకు వచ్చిన తరువాత అందరిని అడగ్గా… సందీప్ ని ముగ్గురు, శివాజీని ఏకంగా ఆరుగురు నామినేట్ చేస్తున్నట్లు చేతులు ఎత్తారు. కన్ఫెషన్ రూమ్లో ఎవరి పేరు చెప్పని ప్రియాంక, తేజ… బయటకు వచ్చిన తరువాత శివాజీ పేరు చెప్పారు. శోభ శెట్టి కూడా శివాజీ పేరు చెప్పింది. అలా హౌస్ మేట్స్ గా ఉన్న శివాజీ తన పవర్ అస్త్ర కారణంగా హౌస్ లోని వాళ్లకు నచ్చక తిరిగి కంటిస్టెంట్ అయ్యాడు. దీంతో అతడి పవర్ అస్త్ర నీ వెనక్కి తిరిగిచ్చేసాడు. అలా శనివారం ఎపిసోడ్ కంప్లీట్ అయింది.