కమల్ హాసన్ కి వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు.. కారణం ఏంటో తెలుసా..?

తమిళ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కమలహాసన్. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించాయి. అలాగే ఆయన తమిళం తో పాటు తెలుగులో కూడా మంచి హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇలా వ‌రుప విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రయోగాత్మక సినిమాలను చేయడంలో కమల్ ఎప్పుడు ముందుంటాడని చెప్పాలి. ఇక ఒకప్పుడు కమల్ అలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాడు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా కమలహాసన్ సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో లోక నాయకుడిగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. అయితే కమలహాసన్ తెలుగులో చేసిన శుభసంకల్పం సినిమాని కె విశ్వనాథ్ మోహన్ బాబుతో తర్కెక్కించాలని భావించారట. కానీ మధ్యలో చిన్న భేదాభిప్రాయాలు రావడంతో విశ్వనాథ్ గారు కమలహాసన్‌తో ఆ సినిమాను చేశారని సమాచారం.
ఇక మోహన్ బాబు చేయాల్సిన క్యారెక్టర్ ని కమల్ హాసన్ చేయడంతో మోహన్ బాబు బాగా కోపం తెచ్చుకున్నారట‌.

కమలహాసన్ కి చిన్నపాటి వార్నింగ్‌ కూడా ఇచ్చారని తెలుస్తుంది. ఇక కమల్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ లో జీవించేసాడు. తన అద్భుతమైన నటనతో ఈ సినిమాలో సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు చేసి ఉంటే అంత మంచి ఔట్పుట్ అయితే కచ్చితంగా రాదు అంటూ చాలామంది సినీ విశ్లేషకులు కామెంట్స్ చేశారు.