ఆర్తి అగర్వాల్ ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇప్పుడు మన మధ్య ఆమె లేకపోయినప్పటికీ ఆమె సినిమాల ద్వారా ఇంకా కోట్లాదిమంది అభిమానుల అభిమానాన్ని దక్కించుకుంటూనే ఉంది . టీవీలో నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావ్ , ఇంద్ర లాంటి సినిమాలు చూసినప్పుడు ఆమెను జనాలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు .
కాగా కెరియర్ లో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుతు అయ్యింది. ఆ తరువాత ఆర్తి అగర్వాల్ అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. కాగా ఆర్తి అగర్వాల్ ఇంటికి వెళ్లి ఓ స్టార్ హీరో తండ్రి నా కొడుకుని పెళ్లి చేసుకో అంటూ తెగ బ్రతిమిలాడట . అంతేకాదు ఆయన ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరో కావడంతో ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది .
అయితే అన్ని కోట్ల ఆస్తి ఉన్న ఆ హీరో తండ్రి వచ్చి అడిగిన ఆర్తి అగర్వాల్ ఏ మేరకు ఆయన ప్రపోజల్ని ఓకే చేయలేదు . దానికి కారణం తరుణ్. అప్పటికే తరుణ్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఆర్తి అగర్వాల్ ఆయనను పెళ్లి చేసుకోవాలని ..స్టార్ హీరో తండ్రి ఆఫర్ ను రిజెక్ట్ చేసింది . ఒకవేళ ఆరోజు ఆమె ఆయన ప్రపోజల్ని ఓకే చేసుంటే ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఓ బడా ఇంటికి కోడలుగా రాజ్యమేలేసి ఉండేది . విధి ఆదిన వింత నాటకంలో ఆర్తి అగర్వాల్ బలైపోయింది..!!