మళ్ళీ జబర్ధస్త్ లోకి అనసూయ.. ఈ ట్వీస్ట్ అస్సలు ఊహించలేదుగా..!!

ఎస్ .. ప్రెసెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ .. మరోసారి జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ  ఇవ్వబోతుందా ..? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నుంచి తప్పుకున్న ఆమె.. జబర్దస్త్ పై సంచలన  కామెంట్స్ చేసింది .

బాడీ షేమింగ్ కామెంట్స్ తట్టుకోలేకపోతున్నాను అని .. ఆ కారణంగానే బయటకు వచ్చేసానని చెప్పిన అనసూయ రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ పోల్ పెట్టింది. “నన్ను మళ్లీ మీరు బుల్లితెరపై చూడాలి అనుకుంటే..  ఏ షో తో వస్తే లైక్ చేస్తారు అనే కాన్సెప్ట్ తో పోల్ కండక్ట్ చేసింది”. ఎక్కువ మంది జబర్దస్త్ అంటూ ఓట్ చేశారు.

దాదాపు 79 శాతం మంది ఆమెను జబర్దస్త్ ద్వారా రియంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు . దీనితో సోషల్ మీడియాలో ఇదే పోల్ వైరల్ గా మారింది. ఒకవేళ ఈ విధంగా చూసుకుంటే అనసూయ జబర్దస్త్ ద్వారానే మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతుందేమో అంటూ జనాలు  ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు ఆమె ఫ్యాన్స్. చూద్దాం ఏం జరుగుతుందో..?