ప్రసాద్ ఐ మ్యాక్స్ లో.. రెబల్ స్టార్ 100 అడుగుల భారీ కటౌట్..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు తెరకెక్కుతుండగా.. వాటిలో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ” సలార్ సీస్ ఫైర్ పార్ట్ 1 ” ఒకటి. ఈ పార్ట్ డిసెంబర్ 22న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని హోంబలె ఫిలిమ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. ప్రారంభం నాటి నుంచి అందరిలో ఆకాశాన్ని అందుకునే స్థాయిలో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా తప్పకుండా రిలీజ్ తర్వాత భారీ విజయం అందుకుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇక అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో ప్రభాస్ యొక్క వంద అడుగుల భారీ కటౌట్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సలార్ నుంచి ప్రభాస్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ కూడా రానున్నట్లు టాక్. ప్రస్తుతం ప్రభాస్ భారీ కటౌట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.