అమర్దీప్ భార్య తేజ‌స్వి చెప్పిన ఏడు సూత్రాలు పాటించి ఉంటే.. కథ వేరే లెవల్ లో ఉండేద‌ట‌.. !!

మనం ఏంటి అనేది.. మన చుట్టూ ఉన్నవాళ్లు కంటే మన ఇంట్లో ఉన్న వాళ్లకే బాగా తెలుస్తుంది. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నయ్య, భార్య.. ఇలా నీ ప్రవర్తన ఎలాంటిదో వాళ్లే ఏదో ఒక సందర్భంలో చెబుతుంటారు. ఎందుకంటే నువ్వు రక్తసంబంధం కాబట్టి.. కానీ బయట జనాలకి నువ్వెవరో కూడా తెలియదు. ఇది పక్కన పెడితే.. తేజస్విని గౌడ, బామ్మర్ది గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మనం ఇప్పుడు బిగ్‌బాస్ ఆట చూసి.. అమర్‌ని జడ్జ్ చేస్తున్నాం. కానీ తేజు మాత్రం ఎప్పుడో చెప్పేసింది. వీడు బిగ్ బాస్ కి పనికి రాడని. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు అతన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తన అర్ధాంగి చెప్పిన ఈ ఏడు సూచనలను అమర్ పాటించి ఉంటే.. అతని పరిస్థితి ఇలా ఉండేది కాదు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు అమర్దీప్ కి తేజు చెప్పిన ఏడు సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. ఎక్కువ కోప్పడొద్దు

2. ఎక్కడ ఏమి మాట్లాడుతున్నావో బాగా గుర్తుపెట్టుకో

3. ఎవరితో ఎంతలో మాట్లాడాలో అంతే మాట్లాడు.

4. ఏదైనా ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడు.

5. నువ్వు నీలాగే ఉండు.. నీకోసం ఆడు

6. ముఖ్యంగా ఎవరిని నమ్మొద్దు

7. ఎదుటి వాళ్లు గేమ్ ఆడుతున్నారో లేక మైండ్ గేమ్ ఆడుతున్నారో అర్థం చేసుకో.

తేజు చెప్పిన ఏడు సూచనలను అమరదీప్ పాటించినట్టు ఎక్కడ కనిపించలేదు. అందుకే అందరూ మనోడ్ని ఆటలో అరటిపండును చేస్తూ.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.