అతను అంటే నాకు చాలా ఇష్టం.. మృనాల్ ఠాగూర్

సీతారామమ్‌ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది మృణాల్ ఠాగూర్. ఈ సినిమాలో ఓ వైపు సీతగా మరోవైపు ప్రిన్సెస్ నూర్జహాన్‌గా తన ప్రతిభను చాటుకుంది. ఈ సినిమాలో మృణాల్ నటనకు కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది. ప్రస్తుతం మృణాల్ టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో బిజీగా గడుపుతుంది. ఇటీవల బాలీవుడ్ మూవీ ఆంక్ మంచోలి ప్రమోషన్స్ లో మృణాల్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఇందులో భాగంగా ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి స్పందించింది. పర్సనల్ లైఫ్ లో ఆమె వివాహం పై తల్లి ఒత్తిడి ఉందని.. అయితే నేను ఇంకొన్ని సినిమాలు చేసి కెరీర్ లో బాగా సెట్ అయిన తరువాతే వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నానంటూ వివరించింది. కానీ మ్యూజిషియ‌న్ కిను రీవ్స్‌ అంటే నాకు చాలా ఇష్టమని ఒకవేళ అతడి లాంటి వ్యక్తి గనుక తారసపడితే తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ హీరో నానితో హాయ్ నాన్న సినిమాలో నటిస్తుంది.

మూవీలో నానికి పర్ఫెక్ట్ జోడిగా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న ఓ రొమాంటిక్ పోస్టర్ రిలీజై ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గీత గోవిందం ఫేమ్ పరుశురామ్‌ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.