సినీ ప్రియుల‌కి గుడ్ న్యూస్‌.. ఒక రోజులోనే థియేటర్స్‌లో ఏకంగా 10 సినిమాలు..!!

ఎలా చూసుకున్నా సరే థియేటర్స్ లో ప్రతి శుక్రవారం 1, 2 అదీ కాదంటే ఓ మూడు సినిమాల వరకు రిలీజ్ అవుతున్నాయి. అంతకు మించి వస్తే మాత్రం థియేటర్ల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రతిదీ సమస్య అవుతుంది. కానీ అలాంటి వాటిని అసలు పట్టించుకోకుండా ఈ శుక్రవారం ఏకంగా 10 సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. ఇంతకీ అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రతివారం ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు వీటికి పోటీ ఇచ్చేలా థియేటర్లలో ఈ శుక్రవారం దాదాపు 10 వరకు కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో ” మ్యాడ్, రూల్స్ రంజన్, మామా మశ్చీంద్ర, మంత్ ఆఫ్ మధు, ఏందిరా ఈ పంచాయతీ, అభిరామచంద్ర, గన్స్ ట్రాన్స్ యాక్షన్ లాంటి స్ట్రెయిట్ సినిమాలు ఉన్నాయి.

పైన చెప్పిన సినిమాలకే థియేటర్లు దొరకడం కష్టం అనుకుంటే 800, చిన్నా, ఎక్సార్సిస్స్ అనే డబ్బింగ్ మూవీస్ కూడా ఇదే తేదీకి బిగ్ స్క్రీన్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మొత్తం లిస్టులో కాలేజీ కామెడీ ఎంటర్టైనర్ స్టోరీతో తీసిన ” మ్యాడ్ ” కాస్త ఆసక్తి కలిగిస్తుంది. మిగతా వాటిపై పెద్దగా బజ్‌ లేదు. అయితే వీటిలో ఏది హిట్ అవుతుందో ఏంటనేది తెలియాలంటే మరో మూడు రోజుల ఆగాల్సి ఉంది.