ప్ర‌భాస్ కు అదిరిపోయే బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇవ్వ‌బోతున్న అభిమానులు.. ఏర్పాట్లు షురూ!

సౌత్ ఇండ‌స్ట్రీ నుంచి తొలి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది ప్ర‌భాసే. బాహుబ‌లి త‌ర్వాత‌ ప్ర‌భాస్ సినిమా అంటే రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్‌లు క్రియేట్ చేయ‌డం కామ‌న్‌గా మారిపోయింది. దీంతో బాలీవుడ్ స్టార్స్ సైతం ప్ర‌భాస్ తో పోటీకి భ‌య‌ప‌డుతున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ విష‌యానికి వ‌స్తే.. మ‌న దేశంలోనే కాదు విదేశాల్లోనూ డార్లింగ్ కు భారీగా అభిమానులు ఏర్ప‌డ్డారు.

అయితే రేపు(అక్టోబ‌ర్ 23) ప్ర‌భాస్ బ‌ర్త్‌డే. పైగా ద‌స‌రా పండుగ కూడా రేపే వ‌చ్చింది. దీంతో అభిమానుల సంబ‌రాలు అంభ‌రాన్ని అంట‌బోతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో డార్లింగ్ బ‌ర్త్‌డే వేడుక‌లను ఫ్యాన్స్ ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు షురూ చేశారు. అంతేకాదు, ఈసారి ప్ర‌భాస్ కు అదిరిపోయే బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చేందుకు అభిమానులు రెడీ అయ్యాడు.

హైదరాబాద్ కుకట్ పల్లి లో కైతలపూర్ గ్రౌండ్స్ లో ప్ర‌భాస్ యొక్క‌ భారీ కటౌట్ ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత పొడవైన కటౌట్ ని పెట్టి త‌మ అభిమాన హీరోను సర్ప్రైజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప‌నులు కూడా జోరుగా సాగుతున్నాయి. రేపు ఉద‌యం 11 గంటలకి ఈ భారీ కటౌట్ ను ఆవిష్కరించి గ్రాండ్ గా డార్లింగ్ బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకోనున్నారు. ఇక మ‌రోవైపు ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్ర‌తి సినిమా నుంచి ఏదో ఒక బ్లాస్టింగ్ అప్డేట్ రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.