ఉన్నఫలంగా గోవా వెళ్తున్న ఎన్టీఆర్ కారణం అదేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే రాజమౌళి – ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకుని దేవర సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు కొరటాల. దీనికి తగ్గట్టుగానే భారీ సెట్స్ తో యాక్షన్స్ సన్నివేశాలను రూపొందిస్తున్నాడు.

ఇక తాజాగా హైదరాబాద్ లో స్పెషల్ సెట్స్ వేసి షూటింగ్ పూర్తి చేసుకున్నారు దేవర మూవీ టీం. అయితే షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ గోవాకి పయానం అయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గోవాకు వెళుతున్నది కూడా సినిమా షూటింగ్ కు సంబంధించిన షూటింగ్ కోసమేనట. ఆల్రెడీ గోవాలో ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ సెట్స్ వేశారని.. దానిలో హీరో.. హీరోయిన్ లకు సంబంధించిన షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ జాన్వి కపూర్ కలిసి ఈ సన్నివేశంలో నటించబోతున్నారు. దీనికోసమే ఎన్టీఆర్ గోవా వెళ్లారని ఈ సినిమా షూటింగ్ మరింత వేగం చేస్తున్నారని సమాచారం.

ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న సంగతి కొరటాల శివ తాజాగా వెల్లడించాడు. మొదటి భాగం మేకర్స్ మొదట అనౌన్స్ చేసినట్లుగానే ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. తరువాత భాగం భాగం షూటింగ్ వెంటనే మొదలు పెడతారు. ఇక ఇదే సినిమా కాకుండా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతోపాటే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో నటించబోతున్నాడు ఎన్టీఆర్. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ సినిమాలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు అంటూ ఇటీవల న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.