నయనతార – కమల్ కాంబోలో ఫిక్స్ అయిన మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ మూవీ తో చాలా కాలం తర్వాత సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం కమలహాసన్ కల్కి 2898 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కమల్ హాసన్ నెగిటివ్ షెడ్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. కమల్ హాసన్ తాజాగా మరో ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ న్యూస్ వినిపిస్తుంది.

మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. గతంలో కమల్ – మణిరత్నం కాంబినేషన్లో నాయకుడు సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరికి ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్ గా చెప్పవచ్చు. చాలాకాలం తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. కమలహాసన్ కెరీర్ లో 234వ సినిమాగా ఇది తెరకెక్కబోతుంది. ఈ మూవీలో హీరోయిన్గా మొదటి త్రిష అనుకున్నారట.. కానీ ఇప్పుడు నయనతారని ఫైనల్ చేసినట్లు సమాచారం.

దాదాపు అందరూ స్టార్ హీరోలతో నయనతార నటించింది. కానీ కమల్ హాసన్ కి జోడిగా ఆమె చేయలేదు. త్వరలోనే ఈ రేర్ కాంబో కూడా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడట. మణిరత్నం కమ్మలు కాంబోలో సినిమా రావడం అందులోను నయనతార హీరోయిన్గా నటించడంతో పాటు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడంతో ఈ సినిమాపై వస్తున్న వార్తలు నిజమైతే బాగుండని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.