నాగార్జున వైఫ్ అమల బంగారం ధరించకపోవడానికి వెనుక షాకింగ్ నిజాలు..!!

అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హీరోకు భార్యగా కథానాయకిగా.. కోడలుగా మరో హీరోకు తల్లిగా చాలా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.. ఎన్నో మూగజీవాలకు సంబంధించి పలు సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటుంది అమల.. అమల అక్కినేని కోడలు కాకముందు.. ఈమె పేరు అమల ముఖర్జీ ఈమె తల్లితండ్రులు విదేశాలలో ఉంటారు. వీరి తండ్రి నేవీలో ఆఫీసర్.1986లో మైథిల్ ఎన్నై కథాలి అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ ఇతర భాషలలో నటించింది. ఈమె తెలుగులో మొదటిసారి నాగార్జున హీరోగా నటించిన కిరాయిదాదా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన అమల.. ఆ తర్వాత తన రియల్ లైఫ్ పార్ట్నర్ గా కూడా నాగార్జునని చేసుకోవడం జరిగింది. వెండితెరపై నాగార్జున అమల తిరుగులేని జోడి అని ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లో కూడా తమ హవా చూపించారు.

నాగార్జున, అమల కలిసి చివరిగా నిర్ణయం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ 1992 జూన్ 11న తిరుపతిలో వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అమల ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఒకే ఒక జీవితం వంటి సినిమాలలో కీలకమైన పాత్రలో నటించింది. నాగార్జునకు అన్నపూర్ణ స్టూడియో తో పాటు నిర్మాతగా బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నారు. అయితే అమల ఏదైనా ఫంక్షన్లకు కనిపించిన చాలా సాదాసీదా గానే కనిపిస్తుంది.. ఎలాంటి బంగారు ఆభరణాలు ధరించకుండా నగలు ధరించకుండా చాలా సింపుల్ గా వస్తూ ఉంటుంది.. అమల అలా ధరించకపోవడానికి ముఖ్య కారణం ఆమెకు చర్మానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయట ఈ కారణం చేత ఈమె మెడలో నల్లపూసల దండ తప్ప మరి వాటిని వేసుకోవడానికి ఇష్టపడదట.