`గ‌ర్ల్‌ఫ్రెండ్` గా మారిన ర‌ష్మిక‌.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఫ‌స్ట్‌ గ్లింప్స్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మందన్నా కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తోంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే ఈ బ్యూటీ చేతిలో పుష్ప 2, యానిమ‌ల్‌, రెయిన్ బో, ధ‌నుష్ డి51తో స‌హా దాదాపు అర డ‌జ‌న్ చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ర‌ష్మిక ఇప్పుడు గ‌ర్ల్‌ఫ్రెండ్ గా మారిపోయింది. ఎవ‌రికీ అనుకోండి.. అది ఆమె కొత్త సినిమా టైటిల్‌.

ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాల్లో గ్లామర్‌ పాత్రలతోనే మెప్పించిన ర‌ష్మిక‌.. ఇటీవ‌ల లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గు చూపుతోంది. ఇందులో భాగంగానే రెయిన్ బో మూవీకి సైన్ చేసింది. ఇప్పుడు `ది గ‌ర్ల్‌ఫ్రెండ్`కు ఒప్పుకుంది. చిలసౌ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న రాహుల్ రవింద్రన్‌ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్క‌బోతోంది.గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నిర్మితం కానున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది. తాజాగా ది గ‌ర్ల్‌ఫ్రెండ్ ఫ‌స్ట్ గ్లింప్స్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఉత్కంఠ రేకెత్తించే విధంగా ఉన్న ఈ గ్లింప్స్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. `నేను దాన్ని ఎంత ప్రేమిస్తున్నానంటే.. దానికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ అక్కర్లేదురా.. నేను చాలు. 24గంటలు పిల్ల నాతోనే ఉండాలనిపిస్తది. నాది అని చెప్పుకోవడానికి ఒక గర్ల్ ఫ్రెండ్‌ ఉంటే ఆ కిక్కే వేరురా` అని ఓ వ్య‌క్తి వాయిస్ ఓవ‌ర్ తో రష్మికని పరిచయం చేశారు. వాటర్‌లో స్మైల్‌ ఫేస్‌తో కనిపించిన ర‌ష్మిక‌.. క్రమంగా సీరియస్‌గా మారిపోయింది. పెయిన్ ఫుల్ ల‌వ్ స్టోరీతో గ‌ర్ల్‌ఫ్రెండ్ రాబోతోంద‌ని గ్లింప్స్ ద్వారా అర్థం అవుతోంది. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయి.