ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్‌గా బ్రహ్మానందం.. ఆస్తుల విలువ ఇన్ని కోట్లా..!!

ఇండియాలో రిచెస్ట్ కమెడియన్ ఎవరో తెలుసా? ఎక్కడ ఏ విషయం జరిగిన తన డైలాగ్ లు యాడ్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. తన నటనతో ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న ఆ వ్యక్తి మరెవరో కాదు మన బ్రహ్మానందం. రూ. 490 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఈయన.. ఒక్కో సినిమాకు కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు పారితోషకం, యాడ్స్ కోసం కోటి వరకు తీసుకుంటున్నాడని సమాచారం. ఆయన కోసం సెపరేట్ కామెడీ ట్రాక్స్ రాసిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు.

తన స్క్రీన్ ప్రజెన్స్ మూవీ హిట్ కు కారణమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ లెజెండ్రీ కమెడియన్ అండ్ గ్రేట్ యాక్టర్… అగ్రికల్చర్ ల్యాండ్, హైదరాబాద్‌తో పాటు సోంతూరులో బంగ్లా , లగ్జరీ కార్లు కలిగి ఉన్నాడని టాక్. ఒక కార్పెంటర్ కొడుకైన బ్రహ్మానందం.. లెక్చరర్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంక్రెడిబుల్ కమెడియన్గా ఎదిగిన జర్ని ఓ అద్భుతం.

ఈయన ఎదుగుదల చూసిన ప్రేక్షకులు ఈయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. వయసు మల్లుతున్నప్పటికీ సినిమాలకి ఏ మాత్రం బ్రేక్ ఇవ్వకుండా తనకొచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. తాజాగా తన చిన్న కుమారుడి పెళ్లి చేసి సంతోషకరమైన జీవితాన్ని గడిపేస్తున్నాడు బ్రహ్మి. గతంలో నటించినన్ని సినిమాలు ఇప్పుడు నటించలేకపోయినా. ఆయన నటించిన ప్రతి సీన్‌ ను ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన కూడా దాంతో యాడ్ చేసి ట్రోలింగ్స్ లో ట్రెండ్ చేస్తూ ఉంటారు.