టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రాజావారు రాణిగారు మూవీతో ఇండస్ట్రీకి పరిచయమై.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నిస్తున్న కిరణ్.. తాజాగా `రూల్స్ రంజన్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. రత్నం కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించారు.
స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.వెన్నెల కిశోర్, హైపర్ ఆది, మకరంద్ దేశ్‌పాండే, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలను పోషించారు. `సమ్మోహనుడా` సాంగ్ తో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ఆ అంచనాలు రూల్స్ రంజన్ అందుకోలేకపోయింది.
అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ లభించింది. అయితే టాక్ తో పాటు ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా యావరేజ్ గానే ఉన్నాయి. కిరణ్ ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ, ఆయనకు గట్టి దెబ్బే పడింది. రూ. 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలోకి దిగిన రూల్స్ రంజన్.. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 లక్షలకి అటూ ఇటూగా షేర్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా రూ. 50 లక్షల రేంజ్ లో షేర్ ను వసూల్ చేసింది. ఇక ఓవర్సీస్ లో ఫస్ట్ డే జస్ట్ 15కె డాలర్స్ ను రాబట్టింది. ఇంకా రూ. 4 కోట్లు వస్తేగాని సినిమా క్లీన్ అయ్యే ఛాన్స్ లేదు.