నందమూరి హీరో కల్యాణ్ రామ్ బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో కల్యాణ్ రామ్ ట్రాక్ లోకి వచ్చారని నందమూరి సత్తా చాటారని అభిమానులు కుషీ అవుతున్నారు. నిజానికి కల్యాణ్ రామ్ 2003లో తొలిచూపులోనే అనే సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. అదే సమయంలో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ మాత్రం స్టార్ హీరోగా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.
కానీ కల్యాణ్ రామ్ చాలా సినిమాలు చేసిన అందులో చెప్పుకోదగ సినిమాలు మాత్రం లేవు. కాగా కల్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీ నుండే వచ్చిన ఎన్టీఆర్ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకోలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయట. అవేంటంటే… ఎన్టీఆర్ చూడాలని ఉంది సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చాడు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన ” స్టూడెంట్ నెంబర్ 1 ” సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన, డ్యాన్స్, డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుస హిట్లను అందుకున్నాడు. కానీ కల్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభంలో కథల ఎంపికలో తడబడ్డాడు. దాంతో వరుస ఫ్లాప్ లు పడ్డాయి. అంతేకాకుండా ఎన్టీఆర్ చూడటానికి అన్నగారిలా ఉన్నారని పొగడ్తల వర్షం కురిసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మనవడిగా ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ కల్యాణ్ రామ్ విషయంలో అలా జరగలేదు. ఎన్టీఆర్ కేవలం నటనపై మాత్రమే దృష్టి పెట్టాడు.
కానీ కల్యాణ్ రామ్ మాత్రం సినిమాలను నిర్మించడం కూడా చేసి నటనపై సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోయాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ ఎక్కువగా కలుపుగోలు మనిషి ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతాడు. ఎన్టీఆర్ మాటకారి కూడా దీంతో తన మాటలతో ఫాలోయింగ్ ను మరింత పెంచుకున్నాడు. కానీ కల్యాణ్ రామ్ మాత్రం సైలెంట్.. పెద్దగా మాట్లాడడు. ఇలా కల్యాణ్ రామ్ స్టార్ స్టేటస్ రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.