బిగ్‌బాస్ ” కే నీతులు చెబుతున్న శివాజీ.. ఎందుకు భరిస్తున్నారు..!!

బిగ్ బాస్ హౌస్ లో సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ హడావిడి ఉంటుంది. ఈసారి కూడా అలానే జరిగింది. హౌస్ మేట్స్ అయినవాళ్లు తప్పించి అందరూ నామినేట్ అయ్యారు. అలానే పవర్ అస్త్ర గెలుచుకునే విషయంలో కంటెస్టెంట్స్ కి చివర్లో పెద్ద షాక్ తగిలింది. ఇంతకీ సోమవారం ఎలిమినేషన్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

రతిక ఎలిమినేట్ అయిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత శివాజీని లగ్జరీ రూమ్ నుంచి వేరే గదికి షిఫ్ట్ అవ్వమని బిగ్ బాస్ ఆదేశించాడు. అయితే తనకి బెడ్ ఎక్కడ ఇవ్వాలని శోభా, ప్రశాంత్, సందీప్ మాట్లాడుతుండగా మధ్యలో తేజ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతనితో శోభ గొడవ పడింది. ఆ తర్వాత శివాజీ డీలక్స్ రూమ్ లోకి వచ్చాడు. అదే టైంలో తేజాని జైల్లో పెట్టారు. సాధారణంగా ఎలిమినేషన్స్ అంటే బిగ్ బాస్ హౌస్ అంతా హీటెక్కి పోతుంటది. కానీ ఈసారి అంతా చెప్పుకోదగ్గ గొడవలు ఏమీ లేవు. ఇంతకీ ఎవరెవరు ఎవర్ని నామినేట్ చేశారు ఇప్పుడు చూద్దాం.

* శివాజీ-అమర్‌దీప్, ప్రియాంక

* ప్రియాంక-శివాజీ, ప్రిన్స్

* గౌతమ్ – అమర్దీప్, శివాజీ

* శుభశ్రీ-అమర్దీప్, ప్రియాంక

* ప్రిన్స్ -అమర్దీప్, ప్రియాంక

* అమర్దీప్-శుభ శ్రీ, శివాజీ

* తేజ-గౌతమ్, యావర్

నామినేషన్స్ జరగడానికి ముందు ఓ సందర్భంలో మాట్లాడిన శివాజీ.. తనని వాళ్లందరూ విలన్లచూడాలనుకుంటున్నారు కానీ తను ఎప్పుడు హీరోనే అని కాస్త అతిగా మాట్లాడాడు. ఇక నామినేషన్స్‌లో అమర్దీప్ ని నామినేట్ చేసి అతనితో చాలాసేపు వాదోపవాదాలు పెట్టుకున్నాడు. గ్రూపులు కడుతున్నారని, హౌస్ లోకి రాకముందే అందరూ మాట్లాడుకుని వచ్చారని నాకు రెండోవారమే అర్థమయిపోయిందని అతి చేశాడు. ఇక ప్రియాంక నామినేట్ చేసిన తర్వాత ఆమెతో మాట్లాడుతూ ఆ సందర్భంగా తను బిగ్ బాస్ ప్రైస్ మనీ గెల్చుకోవడానికి రాలేదని.. కేవలం ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడానికి మాత్రమే వచ్చాడని చెప్పుకొచ్చాడు.

అంటే ఎలానో గెలవడు, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసి పోతా అన్నట్టు కామెంట్స్ చేశాడు. నామినేషన్స్ తతంగం అంత పూర్తయిన తర్వాత ఈ వారం.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లలో తేజ, శివాజీ, ప్రియాంక, అమర్దీప్, శుభశ్రీ, యావర్, గౌతమ్ ఉన్నారని బిగ్ బాస్ చెప్పాడు. అలానే ఇప్పటివరకు పవర్ అస్త్ర కోసం ఇన్నేళ్లు హౌస్ మేట్స్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇకపై ప్రేక్షకుల చేతిలో ఈ నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంటే ఈ వారం పవర్ అస్త్ర గెలుచుకునేది ఎవరో.. ఓటింగ్ ద్వారా ఆడియన్స్ డిసైడ్ చేయబోతున్నారట. ఇక్కడతో సోమవారం ఎపిసోడ్ కంప్లీట్ అయింది.