టికెట్ ప్రి బుకింగ్స్ లో దుమ్ము లేపుతున్న ” భగవంత్ కేసరి “….!!

నందమూరి నటసింహం బాలయ్య లేటెస్ట్ మూవీ ” భగవంత్ కేసరి “. ఈ సినిమా అక్టోబర్ 19న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న సంగతి తెలిసిందే. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించగా… కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీ లీల కీలక పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటించారు.

తామందరూ ఎంతో కష్టపడి రూపొందించిన ఈ సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంటుందని మేక‌ర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమా యొక్క ప్రచార చిత్రాలు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొల్పాయి. ఇక నిన్న సాయంత్రం ఈ మూవీ యొక్క టికెట్ ప్రి బుకింగ్స్ పలు ఆన్లైన్ టికెట్ సంస్థలు ఓపెన్ చేయగా అప్పటినుంచి అనేక ప్రాంతాల్లో మంచి బుకింగ్స్‌ తో దుమ్మురేపుతుంది.

ముఖ్యంగా పలు ప్రాంతాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో ఫాస్ట్ ఫీలింగ్స్ జరుగుతుండడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో రెండు విజయాలు సొంతం చేసుకున్న బాలయ్య… ఈ సినిమాతో మరొక విజయం అందుకుని కెరీర్ పరంగా హ్యాట్రిక్ నమోదు చేస్తారని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.