బోనీకూతురు అందంముందు అతిలోక సుంద‌రి కూతుళ్లు బ‌లాదూర్‌…!

అతిలోక సుందరి శ్రీదేవి కూతుర్లు జాన్వి కపూర్, ఖుషి కపూర్‌లకు పరిశ్రమ అవసరం లేదు ఈ ఇద్దరు భామలు హీరోయిన్లుగా అడుగుపెట్టకముందే తమ హాట్ ఫోటోషూట్లతో లైమ్ లైట్‌లో వెలిగిపోయారు. సెలబ్రిటీస్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక శ్రీదేవి పెద్దకూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం హీరోయిన్గా మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది. ఇక చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా ది అర్చీస్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది.

ఇద్దరిని బెస్ట్‌గా తీర్చిదిద్దిన బోనీకపూర్ తెలివైన ఎత్తుగడలతో కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నాడు. కోట్లాది రూపాయలని కూతుళ్లు సంపాదిస్తుంటే.. బోనీ కపూర్ ఆనందానికి అంతులేదు. కానీ బోనీతో శ్రీదేవి వారసురాలు ఖుషి, జాన్వి అందంగానే ఉన్నారా లేదా బోనీ కపూర్ కి అతడి మాజీ భార్యకు జన్మించిన అన్షులా కపూర్ అందంగా ఉందా అంటూ ఇప్పుడు ఓ క్వశ్చన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దానికి కారణం తాజాగా రివీల్ అయిన అన్షులా కపూర్ బ్యూటిఫుల్ లుకింగ్ వీడియో. ఈ వీడియోలో ఫోటోలోనూ అన్షుల ఎంతో అందంగా అనిపించింది.

నిజానికి జాన్వి ఖుషి నిరంతరం జిమ్ముల్లోకి వ్యాయామాలు చేసి ఎంతో కష్టపడి అల్ట్రా స్లిమ్ లుక్ లో కనిపించినా.. అన్షులా వీరిద్దరికీ విరుద్ధంగా బొద్దుగా కనిపించినా. ఎంతో అందంగా అనిపిస్తుంది. తన ముఖంలో ఏదో ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీదేవిని చూసిన కళ్ళతో జాన్వి, ఖుషిలను అభిమానులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆమె అందం వీరిద్దరిలో ఎవరికీ రాలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బోనీకపూర్ మాజీ భార్య కూతురు అన్షులా కపూర్ – ఖుషి కపూర్ కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించారు. అన్షులా కపూర్ ముందు ఖుషి కపూర్ అస్సలు అనడం లేదు.

బోనీకూతురు అందంముందు అతిలోక సుంద‌రి కూతుళ్లు బ‌లాదూర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక 2012లో అన్షులా కపూర్ తల్లి క్యాన్సర్ తో మరణించింది. ఇది తన మనసుపై చెరగని ముద్ర వేసింది. 14 ఏళ్ళ‌ వయసు నుండి pcos సమస్యతో బాధపడుతుంది అన్షులా. అయినా ఈమె ఇటీవల బ్యూటిఫుల్ కమ్‌ బ్యాక్ ఇచ్చింది. ఫిట్నెస్ తో తన పరివర్తన, శరీర సానుకూలత, స్వీయ సంరక్షణ గురించి ఆమె స్టేజ్ పై మాట్లాడింది. ఆన్లైన్ సెలబ్రిటీ ఫండ్రైసర్ ప్లాట్ఫారం అయినా ఫ్యాన్ కైండ్ అనే చారిటీ ఫౌండేషన్ కూడా అన్షులా నడుపుతుంది. ఆమె మాట్లాడే ప్రతిసారి మానసిక ఆరోగ్యం దాని ప్రాముఖ్యత గురించి వివరిస్తూనే ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Anshula Kapoor (@anshulakapoor)