వరుణ్ – లావణ్య ల పెళ్లి షెడ్యూల్ ఇదే..!

మెగా హీరో వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ల పెళ్లి వేడుకలు ఇప్పటికే ఇటలీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. నవంబర్ ఒకటవ తేదీన ఈ జంట ఏడడుగులు వేయబోతున్నారు. ఇప్పటికే తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్, ఉపాసన జంట ఇటలీ చేరుకొని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూస్తున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఇటలీ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి తర్వాత అల్లు అర్జున్ ఆయన ఫ్యామిలీతో కూడా వెళ్లారు. ఇలా రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఇద్దరూ కూడా దగ్గరుండి మరీ వరుణ్ పెళ్లి వేడుకలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఈ వేడుకకు అటు మెగా ఇటు అల్లు ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ఇటలీ వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా అక్టోబర్ 30వ తేదీన కాక్టైల్ పార్టీతో పెళ్లి వేడుకలను మొదలుపెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక నవంబర్ 1న పెళ్లి ఆ తర్వాత ఇటలీ నుంచి తిరిగి వచ్చాక నవంబర్ ఐదు న హైదరాబాదులో రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించబోతున్నారట. ఇక ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ కూడా రిసెప్షన్ కి హాజరు కాబోతున్నట్లు సమాచారం.

 

ఇప్పటికే వరుణ్ వెడ్డింగ్ కార్డు కు సంబంధించిన వీడియోతో పాటు కొత్త జంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవ్వగా #Varunlav అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.ఇకపోతే ఈ పెళ్లికి చిరంజీవి తల్లి అంజనా దేవి మాత్రం హాజరు కావడం లేదట. ఆమె ఆరోగ్య రీత్యా జర్నీ చేయడం మంచిది కాదని వైద్యులు చెప్పడంతో ఇండియాలోనే ఉంటున్నట్లు సమాచారం.