బుక్ మై షో లో బాలయ్య ” భగవంత్ కేసరి ” మ్యానియా….!!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల కీలక పాత్రలో దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా ” భగవంత్ కేసరి “. ఈ సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.

గత ఏడాది వచ్చిన ” వీర సింహారెడ్డి ” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ఈ ఏడాది కూడా అదే జోష్లో కొనసాగుతాడని తెలుస్తుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ట్రైలర్ కి మేకర్స్ డేట్ లాక్ చేశారు. అయితే ఈ సినిమాపై మంచి ప్రామిసింగ్ హైప్ ఉండగా ఇది బుక్ మై షో లో అయితే కొనసాగుతుంది.

లేటెస్ట్ గా ఈ సినిమా లక్ష 23 వేల లైక్స్ నమోదు చేసింది. దీంతో భగవంత్ కేసరి కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 19న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది.