కొత్త లుక్‌లో యాంకర్ సుమ కనకాల.. అదిరిపోయిందిగా..

తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ సుమ అనే తెలియనివారు ఎవరూ ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ సుమ పేరు తెలిసే ఉంటుంది. యాంకర్‌తో పాటు నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. సుమ యాంకరింగ్‌ను ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. తన కామెడీ పంచ్ లు, తన అభినయంతో అందరికీ ఆకట్టుకుంటూ ఉంటుంది. తన వాయిస్ తో అందరికీ అలరిస్తూ ఉంటుంది. బుల్లితెరపై షోలతో పాటు ఆడియ్ ఫంక్షన్స్ లలో తన వాయిస్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా సుమ కొత్త లుక్‌లో కనిపించింది. తనలో ఎన్నడూ చూడని గ్లామర్ లుక్‌ను పరిచయం చేసింది. ఇటీవల సుమ వరుస ఫొటోషూట్లలో పాల్గొంటుంది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లలో పంచుకుంటుంది. ఈ ఫొటోషూట్లతో తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులను సుమ పరిచయం చేస్తోంది. తాజాగా కొన్ని ఫొటోలను సుమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి నెట్టింగ్ వైరల్ గా మారుతున్నాయి.

ఈ ఫొటోలలో వైట్ డిజైనర్ వేర్లో సుమ కనిపించింది. సుమ లక్ అదిరిందంటూ సుమ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సుమ బుల్లితెరపై షోలు చేయడం బాగా తగ్గించింది. ఇప్పుడు అమ్మ అవకాయ్, సుమ అడ్డా షోలు మాత్రమే చేస్తుంది. అలాగే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు వెబ్ సిరీస్ లు చేస్తోంది. 1996లో దాసరి డైరెక్షన్ లో కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో సుమ నటించింది. ఆ తర్వాత రెండు, మూడు తమిళ సినిమాల్లో నటించింది. కానీ ఏమైందో ఏమో కానీ సినిమాలకు గుడ్ బై చెప్పి గత పాతికేళ్లుగా తెలుగు బుల్లితెరపై అనేక షోలు చేస్తూ స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.