వారాలు గడిచే కొద్ది హౌస్ లో జనం పలుచబడే కొద్ది నామినేషన్స్ రసవత్తరంగా మారుతున్నాయి. ఈవారం కూడా నామినేషన్స్ తో ఇంటి సభ్యులు మధ్య మంట పెట్టాడు బిగ్ బాస్. నామినేషన్స్ తప్ప మిగతా అన్ని సందర్భాల్లో అమాయకుడిగా కనిపించే ప్రశాంత్ నిన్న మళ్ళీ ఓవరాక్షన్ మొదలుపెట్టాడు. ఈరోజు కూడా అదే కొనసాగినట్లు కనిపిస్తుంది. గౌతమ్ ను మళ్లీ ఇరిటేట్ చేశాడు.
గౌతమ్ తో పాటు అమర్ ను సైతం నామినేట్ చేశాడు. అయితే ప్రశాంత్, అమర్ల మధ్య వార్ నడుస్తుంటే సందులో సడేమియాలా భోలె కలగజేసుకున్నాడు. దీంతో విసిగిపోయిన అమర్.. మధ్యలో వస్తే పగిలిపోద్ది.. అంటూ అక్కడున్న కూర్చీని తన్నాడు. అయినా సరే శివాజీ కలగజేసుకుంటూ నీకు అవసరం అయినప్పుడు ఒకలా మాట్లాడుతావ్. అవసరం లేనప్పుడు ఇంకోలా మాట్లాడతావా? అని అన్నాడు.
అప్పటికే కోపంతో ఊగిపోతున్న అమర్.. మీరు వాడిని సపోర్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా సపోర్ట్ చేసేయండి. నన్ను ఇక్కడ నుంచి పంపించాలని ఎంతో వెధవ ప్రయత్నాలు చేసిన కప్పుతోనే పోతా.. ఐయామ్ బ్యాక్ అంటూ తన విశ్వరూపం చూపించాడు అమర్. అటు శోభా శెట్టి, భోలె మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. అశ్విని, తేజ మధ్య సైతం ఫైట్ జరిగింది. మొత్తానికి నామినేషన్ తో కంటెస్టెంట్లు మధ్య ఆరని చిచ్చు పెట్టాడు బిగ్ బాస్.