విజయ్ ” లియో ” సినిమా…. ” కార్తీక దీపం ” సీరియల్ రీమేకా…..!!

విజయ్ దళపతి ” లియో ” సినిమా నుంచి తాజాగా హిందీ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విజయ్… విలన్ సంజయ్ దత్ గొంతు పట్టుకుని కనిపించగా…” కార్తీక దీపం ” నుంచి కాపీ కొట్టారని ప్రేక్షకులు మీమ్స్‌ చేస్తున్నారు. ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ కార్తీకదీపం.

ఈ సీరియల్ ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నుంచి పోలేదు. తాజాగా మోనిత బిగ్ బాస్ కి వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. అక్కడ ఈమె ప్రవర్తన కూడా కార్తీకదీపం లో మౌనిక లాగానే ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. తాజాగా లియో, కార్తీకదీపం సీరియల్ రీమేకా అంటూ మీమ్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. వంటలక్క, మోనితను ఇలాగే పట్టుకుందని.. ఇందుకు సంబంధించిన పోస్టర్లను ట్రెండ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా పోస్టర్స్ ఒరిజినల్ కాదని ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ని మేకర్స్ రిలీజ్ చేస్తారని కొందరు విమర్శిస్తున్నారు. తెలుగు, కన్నడ పోస్టర్స్ మాత్రమే బాగున్నాయని.. తమిళ్, హిందీ పోస్టర్స్ వరస్ట్ గా ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. కానీ అభిమానులు మాత్రం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉన్నాడని మురిసిపోతున్నారు.