యూఎస్‌లో విజ‌య్ – సామ్‌ ఖుషి ర్యాంప్… జ‌స్ట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్‌తో దుమ్ము లేపిందిగా..!

యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ, సమంత జంటగా రూపొందించిన లేటెస్ట్ లవ్ డ్రామా మూవీ ఖుషి. భారీ అంచనాలతో సెప్టెంబర్ 1 ( ఈరోజు) ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి సాలిడ్ వసూళ్లు నమోదవుతున్నాయి.

 

ఇదివరకే ఊహించినట్లుగా జస్ట్ ప్రీమియర్స్ తోనే 4 లక్షల డాలర్స్ పైగా గ్రాస్ వసూలను రాబట్టింది. దీంతో డే 1 కి ఈ సినిమా ఈజీగా హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి యూఎస్ ఆడియన్స్ నుంచి ఖుషి కి సాలిడ్ వెల్కమ్ అందిందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి హీషం అబ్దుల్ సంగీతం అందించాడు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లు వసూలు చేస్తుంది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సంపాదించిన ఈ మూవీ ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఫ్యూచర్ లో ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.